- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. హెల్త్ బులెటిన్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: నటుడు నందమూరి తారకరత్న హెల్త్ బులెటిన్‌ను నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు శనివారం విడుదల చేశారు. హార్ట్ స్ట్రోక్‌కు గురైన తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కావడం లేదని.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృతిమ శ్వాస అందిస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల పాటు తారకరత్నకు చికిత్స అందించాలని పేర్కొన్నారు. కాగా, శుక్రవారం లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు తారకరత్నను కుప్పంలోని పీఈఎస్ తరలించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం అర్థరాత్రి 2.30 గంటలకు పీఈఎస్ ఆసుపత్రి నుండి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకతర్నకు నిపుణుల వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. అయితే, తారకరత్న రక్త ప్రసరణ నాళాల్లో 90 శాతం బ్లాక్స్ ఉండటంతో స్టెంట్లు వేసిన డాక్టర్లు.. ఎక్మో అమర్చి వైద్యం అందిస్తున్నారు. రక్త ప్రసరణ నాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటంతో శరీర భాగాలకు రక్త ప్రసరణ జరగడం కోసం ఎక్మో అమర్చి వైద్యులు ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నారు.