- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి రెడీ అయిన మిల్కీ బ్యూటీ.. అప్పుడే అంటూ క్లారిటీ..
దిశ, వెబ్‌డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తేమీ లేదు. అమ్మడు అందాలకు కుర్రకారు దాసోహం అంటున్నారు. అమ్మడు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ఒకవైపు హాట్ హాట్ ఐటెం సాంగ్స్‌లో తన అందాలను ఆరబోస్తూనే మరోవైపు హీరోయిన్గా పెద్ద సినిమాలను రఫ్ఫాడిస్తోంది. ప్రస్తుతం తన బిజీ షెడ్యూల్ కారణంగా సోషల్ మీడియాకు కాస్త దూరమైన తమన్నా తాజాగా తన పెళ్లిపై స్పందించింది. ఇటీవల కాలంలో తమన్నా పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
అదిగో అప్పుడే తమన్నా పెళ్లి.. వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అంటూ అనేక వార్తలు వెలుగు చూశాయి. తాజాగా వీటిపైనే తమన్నా స్పందించింది. ప్రస్తుతం తను తన ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాని, మరో రెండేళ్ల పాటు పెళ్లి ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తన కెరీర్ సాఫీగా సాగుతోందని, ఆఫర్లు మంచిగా వస్తున్నాయని చెప్పిన బ్యూటీ ఇలాంటి సమయంలో పెళ్లి పేరుతో కెరీర్‌కు బ్రేకులు వేయలేనని స్పష్టం చేసింది. అయితే తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన 'భోళాశంకర్', ఎఫ్3, దటీజ్ మహాలక్ష్మీ, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటుగా రెండు కన్నడ సినిమాల్లోనూ అమ్మడు నటిస్తోంది.