'సువర్ణ సుందరి' డిజిటల్ టికెట్‌ లాంచ్ చేసిన దిల్ రాజు

by sudharani |   ( Updated:2023-01-31 12:46:05.0  )
సువర్ణ సుందరి డిజిటల్ టికెట్‌ లాంచ్ చేసిన దిల్ రాజు
X

దిశ, సినిమా : 'సువర్ణ సుందరి' డిజిటల్ టికెట్, ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల చేస్తుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా అదే రేంజ్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు సురేంద్ర మాదారపు.. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ సినిమా ఫస్ట్ టికెట్ లాంచ్ చేయడం హ్యాపీగా ఉందన్నారు. హై టెక్నికల్ వాల్యూస్ కలిగిన చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందన్నారు. కాగా డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధానపాత్రల్లో నటించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు.

Advertisement

Next Story