Bigg Boss 7 Telugu: :బిగ్ బాస్ 7లో స్ట్రిక్ట్ రూల్స్.. అలాచేస్తే హౌస్ నుంచి బయటకే?

by samatah |   ( Updated:2023-07-14 06:58:43.0  )
Bigg Boss 7 Telugu: :బిగ్ బాస్ 7లో స్ట్రిక్ట్ రూల్స్..  అలాచేస్తే హౌస్ నుంచి బయటకే?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభం కానుంది. ఆరు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ఏడవ సీజన్‌లోకి అడుగు పెట్టబోతుంది. అతి త్వరలో ఏడవ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కాగా, నాగార్జున ప్రోమో షూట్ కూడా కంప్లీట్ చేశారంట. ఇక ఈ సారి బిగ్ బీలోకి ఎవరు కంటెస్టెంట్స్‌గా వస్తున్నారో అధికారికంగా తెలియదు. కానీ ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో కఠినమైన రూల్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కంటెస్టెంట్స్ కొన్ని సందర్భాలలో మితిమీరి హద్దులు దాటి గొడవలు పెట్టేసుకుంటున్నారు. అలా గొడవలు పెట్టుకుని పొరపాటున నోటి నుండి ఒక బ్యాడ్ పదం కూడా బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే సీజన్5‌లో సిరి, షణ్ముఖ్ మధ్య రొమాన్స్ చూసి ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఈ సారి హౌ‌స్‌లో అలాంటి రొమాన్స్‌కు తావు ఇవ్వకుండా చూసుకుంటారంట.

Read more : ‘బేబీ’ సినిమాకు ఆమెతో కలిసి వెళ్లిన విజయ్ దేవరకొండ.. రష్మికకు హ్యండిచ్చినట్టేనా అంటున్న నెటిజన్లు

Advertisement

Next Story