21 ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరోయిన్..! (వీడియో)

by sudharani |   ( Updated:2024-02-21 15:22:10.0  )
21 ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరోయిన్..! (వీడియో)
X

దిశ, సినిమా: 2002లో వచ్చిన నాగార్జున సినిమా ‘మన్మధుడు’ అందరకికీ గుర్తుండే ఉంటుంది. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ఈ మూవీకి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ చిత్రం ఎంత సూపర్ సక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలో సోనాలి బింద్రేతే పాటు అన్షు కూడా హీరోయిన్‌గా నటించారు. ‘మన్మధుడు’ మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అన్షు.. మొదటి సినిమా సక్సెస్‌తో వరుస ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే ‘రాఘవేంద్ర’, ‘మిస్సమ్మ’ వంటి సినిమాల్లో కనిపించి అలరించింది. అయితే.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్లుండి తెలుగు సినిమాలకు దూరం అయిపోయింది ఈ భామ.

అయితే.. చేసిన రెండు సినిమాల్లో సగంలోనే చనిపోయిన క్యారెక్టర్లు చేసింది ఈ అమ్మడు. ఈ కారణం చేతనే అవకాశాలు రాకో ఏమో తెలియదు కానీ, ఆ త్వారత లండన్ వెళ్లిపోయింది. ఇక ఆమె పుట్టి పెరిగింది కూడా అక్కడే కావడంతో.. కేవలం అతిథిలా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు అలరించింది. అక్కడే చదువు పూర్తి చేసుకున్న అన్షు.. బిజినెస్‌మేన్ సచిన్ సగ్గార్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇదిలా ఉంటే.. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ అమ్మడు తెలుగు నేలపై అడుగుపెట్టినట్లు అర్థం అవుతోంది. ఈ మేరకు.. నిఖిల్ విజయేంద్ర సింహ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేస్తూ.. ‘20 సంవత్సరాల తర్వాత మన్మధుడు హీరోయిన్ మహేశ్వరి (అన్షు) గ్రాండ్ రిటర్న్ కోసం ఎదరుచూస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి! మీకు అందరి ప్రేమతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇందులో అన్షు ‘మన్మధుడు’ సినిమా గురించి, నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Advertisement

Next Story