డబ్బు కోసం ఎస్టీడీ బూత్‌లో పని చేసిన స్టార్ నటి..!

by Anjali |   ( Updated:2023-06-08 05:49:21.0  )
డబ్బు కోసం ఎస్టీడీ బూత్‌లో పని చేసిన స్టార్ నటి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నటి ప్రగతి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘మోడలింగ్ చెయ్యాలనేది పాయింట్ కాదని ఊరికే తింటున్నావ్ అనేలా చేసే కామెంట్లు నాకు నచ్చేవి కావని ఆమె తెలిపారు. పిజ్జా హట్‌లో, టెలీకాం బూత్‌లో, ఎస్టీడీ బూత్లో కూడా పని చేశానని ప్రగతి వెల్లడించారు. ‘‘ఒక యాడ్ కోసం నన్ను అడగ్గా.. అలా మోడలింగ్‌లోకి వచ్చాను. అప్పుడు నేను చాలా లావుగా ఉండేదాన్ని. అయినా హారోయిన్‌గా అవకాశాలు వచ్చినప్పటికి పెద్దగా ఆశస్తి చూపలేదు. ఓ సినిమా షూటింగ్ సమయంలో హీరో కమ్ నిర్మాతతో వివాదం జరిగడంతో ఇకపై సినిమాలే చేయకూడదని ఆ సమయంలో అలా అనుకున్నాను. నేను ఎవరినీ బ్లేమ్ చేయను. ఒకరిని నమ్మి మోసపోయారంటే మోసం చేసే వాళ్ల కంటే మోసపోయిన వాళ్లదే తప్పు అవుతుంది. ఇంకోసారి అదే తప్పును రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుందని’’ ప్రగతి చెప్పుకొచ్చారు.

Also Read: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు..

Advertisement

Next Story