Kavya Maran: బయటపడ్డ SRH ఓనర్ కావ్య మారన్ ప్రేమ వ్యవహారం.. క్యూట్ అండ్ క్లాస్ట్లీ ప్రియుడేవరంటే?

by Anjali |
Kavya Maran: బయటపడ్డ SRH ఓనర్ కావ్య మారన్ ప్రేమ వ్యవహారం.. క్యూట్ అండ్ క్లాస్ట్లీ ప్రియుడేవరంటే?
X

దిశ, సినిమా: SRH ఓనర్ కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇండియాలోని ప్రతి క్రికెటర్‌కు కావ్య పాప గురించి తెలిసే ఉంటుంది.హైదరాబాదు సన్‌రైజర్స్ టీం యజమానైన కావ్యకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పాలోయింగ్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంటే కెమెరా మొత్తం కావ్య పాప వైపే ఉంటుంది. సన్ గ్రూస్ ఓనర్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. 3 వేల కోట్ల రూపాయల బిజినెస్ సామ్రాజ్యానికి కావ్య పాప ఒక్కతే వారసురాలు. ఈమెది గొప్ప మనసు కూడా. ఎవరైన ఆపదలో ఉన్నారంటే వెంటనే ముందుకొస్తుంది. క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఎందరికో కావ్య మారన్ ఆర్థికంగా సహాయం చేసింది. ఇకపోతే కావ్యకు కార్లు అంటే ఎంతో పిచ్చి.మార్కెట్‌లోకి ఏ కొత్త కారు వచ్చిన కొంటుంటుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉన్న విషయం తెలిసిందే. 8 కోట్ల రూపాయలు పెట్టి కావ్య పాప సెడాన్ కారు కొనుగోలు చేసింది. 600 హార్స్ పవర్ ఉన్న బెంట్లీ బెంటాయ్గా ఎస్ యూవీ కారు ఉంది. దీని ప్రైజ్ ఏకంగా 4 కోట్లు. రూ. 2.5 కోట్ల ఫెర్రారీ రోమా స్పోర్ట్ కారు, ప్రీమియం సెడాన్ బీఎమ్‌డబ్లూఐ 7, మెర్సిడెస్ బెంచ్ ఎస్ క్లాస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్.. ఇలా కావ్య మారన్ కోట్లు విలువ చేసే కొత్త కొత్త కార్లను కొంటూనే ఉంటుంది. దీంతో పలువురు నెటిజన్లు.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం క్రికెటర్ అభిషేక్ వర్మతో కాదు ప్రేమలో ఉంది.. కావ్య పాప కార్లతో లవ్‌ పడి చాలా ఏళ్లు అవుతుందంటూ నెట్టింట ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వెరీ క్యూట్ అండ్ క్లాస్ట్లీ బాయ్ ఫ్రెండ్ అంటూ స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed