- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంప్రదాయ దుస్తుల్లో అకిరా, ఆద్య.. పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు చెప్తూ రేణు దేశాయ్ స్పెషల్ పోస్ట్
దిశ, సినిమా: నేడు ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో దేశవ్యాప్తంగా పీఎం మోదీతో సహా అనేకమంది ప్రముఖులు హాజరవుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా నేడు ప్రమాణ స్వీకారం చేస్తుండటం, చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా పిలవడంతో మెగా ఫ్యామిలీ అంతా ఈ ప్రమాణ స్వీకారానికి తరలి వస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీతో కలిసి నిన్న రాత్రే గన్నవరం చేరుకున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులంతా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడడానికి వస్తున్నారు. పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కూడా తమ తండ్రి ప్రమాణ స్వీకారం చూడటానికి గన్నవరం వెళ్లారు. అయితే ప్రమాణ స్వీకారానికి అకిరా, ఆద్య సంప్రదాయంగా పద్ధతిగా రెడీ అయ్యారు. అకిరా పంచె కట్టగా, ఆద్య పద్దతిగా పంజాబీ డ్రెస్ వేసుకుంది.
అకిరా, ఆద్య ఇద్దరూ ప్రమాణ స్వీకారానికి చక్కగా రెడీ అయి రేణు దేశాయ్ కి వీడియో కాల్ చేశారు. రేణు దేశాయ్ తన పిల్లల ఫోటో షేర్ చేసి.. నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి ఏపీ స్టేట్ కి, ప్రజలకు మంచి చేయాలని శుభాకాంక్షలు అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.