అప్పన్నగా గ్లోబల్ స్టార్! .. ఆ లోపం ఉన్న వ్యక్తిగా షాకింగ్ రోల్‌లో రామ్ చరణ్

by Kavitha |
అప్పన్నగా గ్లోబల్ స్టార్! .. ఆ లోపం ఉన్న వ్యక్తిగా షాకింగ్ రోల్‌లో రామ్ చరణ్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ మెగా రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR సినిమాతో అమాంతం క్రేజ్ పెరిగిపోయి తర్వాత ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నాయి. హిట్లు మీద హిట్లు కొడుతూ తన రేంజ్‌ను అమాంతం పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరక్టర్ ఎస్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న స్టోరీలైన్‌తో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఎన్నో అంశాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ పాత్ర పై మరింత సమాచారం బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో అతడు రెండు పాత్రలు చేస్తున్నాడు. అందులో తండ్రి పాత్రకు అప్పన్న అనే పేరును పెట్టినట్లు అసలు మేటర్ లీకైంది.

ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీలో తండ్రి పాత్రను పోషించే రామ్ చరణ్ నత్తి (మాటలు తడబడటం) సమస్య ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. అతడి నుంచి వచ్చే పొలిటికల్ డైలాగులు కూడా డిఫరెంట్‌గా ఉంటాయని అంటున్నారు. కొడుకు, తండ్రి పాత్రల మధ్య వైవిధ్యం కనిపించడం కోసమే దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై మరింత హైప్ పెరుగుతోంది.

Advertisement

Next Story