Siva Rajkumar: శివ రాజ్‌కుమార్, కార్తీక్ అద్వైత్ కాంబోలో మూవీ.. హైప్ పెంచేస్తున్న ఫొటోస్

by sudharani |
Siva Rajkumar: శివ రాజ్‌కుమార్, కార్తీక్ అద్వైత్ కాంబోలో మూవీ.. హైప్ పెంచేస్తున్న ఫొటోస్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ 131వ మూవీతో బిజీగా ఉన్నాడు. కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ లాంచింగ్ ఈవెంట్ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది. పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ పి నిర్మిస్తున్న ఈ కన్నడ బైలింగ్వల్ ఫిల్మ్‌లో శివరాజ్ కుమార్‌ని పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేయనున్నారు మేకర్స్. హై-బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తుండగా.. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక శివ రాజ్ కుమార్, కార్తీక్ అద్వైత్ కాంబోలో మూవీ అనౌన్స్‌మెంట్ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed