వీకెండ్ మధ్యాహ్న భోజనం మరలా ఉండదు.. తాతను తలుచుకుని Sitara Ghattamaneni ఎమోషనల్

by sudharani |   ( Updated:2022-11-16 08:55:44.0  )
వీకెండ్ మధ్యాహ్న భోజనం మరలా ఉండదు.. తాతను తలుచుకుని Sitara Ghattamaneni   ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ నిన్న (మంగళవారం) కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆయన ఇకలేరనే విషయాన్ని కుటుంబసభ్యులతోపాటు సినీ ఇండస్ట్రీ, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో కృష్ణను తలుచుకుంటూ సోషల్ మీడియా వేధికగా తమ ఎమోషన్స్‌ను పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే మహేశ్ బాబు కూతురుకు తాత (కృష్ణ) అంటే ఎంతో ప్రేమ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సితార.. వాళ్ల తాతను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

''వీకెండ్ మధ్యాహ్న భోజనం మరలా ఉండదు.. నువ్వు నాకు చాలా విలువైన విషయాలు నేర్పావు.. ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నావు. ఇప్పుడు మిగిలింది నీ జ్ఞాపకం మాత్రమే. నువ్వే నా హీరో.. ఏదో ఒక రోజు నిన్ను గర్వపడేలా చేయగలనని ఆశిస్తున్నాను. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను తాత గారూ'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more:

1.చనిపోయే ముందు మహేశ్ బాబు గురించి చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు.

Advertisement

Next Story