‘హే సామ్’ అంటూ మోహం మీద అడిగేసిన సీతారామం హీరోయిన్!

by Anjali |   ( Updated:2023-04-12 15:05:42.0  )
‘హే సామ్’ అంటూ మోహం మీద అడిగేసిన సీతారామం హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘‘శాకుంతలం’’ మూవీ రిలీజ్ నేపథ్యంలో సమంత చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుండగా ముంబైతో పాటు ప్రధాన నగరాల్లో సామ్ చక్కర్లు కొట్టారు. కాగా.. ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో ఆకర్షణగా కనిపించనున్నారు. ఈ క్రమంలో ఆడియన్స్‌ని థియేటర్స్‌కు రప్పించాల్సిన పూర్తి బాధ్యత ఆమె మీదే ఉంది. గతంలో ఏ చిత్రాన్ని కూడా ఈ స్థాయిలో ప్రమోట్ చేయలేదు.

తాజాగా ఈ బ్యూటీ ‘‘ఆస్క్ సామ్ హాష్ ట్యాగ్‌’’తో ట్విటర్‌లో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఈ చాట్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ కూడా పాల్గొని.. సమంతను ఆమె ఓ ప్రశ్న అడిగారు. ‘‘హే సామ్ శాకుంతలం చిత్రం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇంతకీ మనమిద్దరం కలిసి ఎప్పుడు నటిస్తున్నాం?’’ అని అడిగారు. దానికి సామ్ వెంటనే సమాధానం ఇచ్చారు. ‘‘ ఓకే దీని గురించి తొందర్లోనే మనం మాట్లాడుకుందాం’’ అని సమంత చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరి ట్విటర్ సంభాషణ నెటిజెన్లను ఆకట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed