ఏ ప్లేస్ ఏ ఏరియైనా పర్వాలేదు.. ఎప్పుడైనా, ఎక్కడికైనా వచ్చేస్తా: సింగర్ సునీత సంచలన కామెంట్స్

by Anjali |   ( Updated:2024-03-14 10:17:09.0  )
ఏ ప్లేస్ ఏ ఏరియైనా పర్వాలేదు.. ఎప్పుడైనా, ఎక్కడికైనా వచ్చేస్తా: సింగర్ సునీత సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ‘ఈ వేళలో నీవు, మహేష్ బాబు నటించి మురారీ సినిమాలో ‘అలనాటి రామచంద్రుని’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడి.. తన గానంతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఇప్పటికీ కూడా పాటలు పాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటుంది.

కానీ రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నాక సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ ఎదుర్కొంటుంది సునీత. కానీ సునీత అవన్నీ పట్టించుకోకుండా.. తన పిల్లల్ని చూసుకుంటూ, లైఫ్ లో ముందుకు వెళ్తోంది. తాజాగా ఈమె హైదరాబాదులోని ఓ కార్యక్రమానికి కార్యక్రమానికి హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘‘మిత్రులందరికీ, మీడియా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి గంట ప్రయాణం పట్టింది. వర్కింగ్ డే అయినా కూడా వచ్చాను. ఎందుకంటే మ్యూజిక్ అంటే అంత ఇష్టం. మ్యూజిక్ లవర్స్ ఉంటే చాలు.. ఏ ప్లేస్ అయినా పర్వాలేదు, ఏ ఏరియా అయినా పర్వాలేదు వచ్చేస్తాను. ఇటు సైడ్ చాలా ప్లేసేస్ లో ప్రోగ్రామ్ చేశాం.

కౌశిల్ ఎలా అయితే అడిగారో.. అలాగే ఎవరైనా ప్లాన్ చేస్తే ఎప్పుడైనా, ఎక్కడికైనా వచ్చేస్తా. ప్లేస్‌తో ఏం ప్రాబ్లమ్ లేదు’’ అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సునీత నవ్వుతూ సమాధానం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సింగర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ‘ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చేస్తా’ అంటూ బాలయ్య రేంజ్ లో డైలాగ్ చెప్పారుగా మేడం అంటూ సునీత పై క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story