తల్లిదండ్రులైన గీతామాధురి-నందు.. ఎవరు పుట్టారో తెలుసా?

by Anjali |
తల్లిదండ్రులైన గీతామాధురి-నందు.. ఎవరు పుట్టారో తెలుసా?
X

దిశ, సినిమా: సింగర్ గీతా మాధురి గురించి సుపరిచితమే. ఈమె తెలుగు , తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 1600 వందలకు పైగా పాటలు పాడి ఇండస్ట్రీలోనే చెరగని ముద్ర వేసుకుంది. గీతామాధురి ఎలాంటి పాటలు పాడిన హిట్ కొట్టడం పక్కా. ‘మగాళ్లు వట్టి మయాగాళ్లే’ అనే సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గీతామాధురి తెలుగు బిగ్ బాస్ సీజన్ - 2 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్‌ను అలరించింది.

ఇక నందును ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో వీరిద్దరిని బెస్ట్ కపుల్‌గా చెప్పుకుంటారు. 2014 లో వివాహం జరగ్గా.. 2019లో వీరికి దాక్షాయణి అనే బుజ్జాయి జన్మించింది. ఇటీవల గీతా మాధురి మళ్లీ ప్రెగ్నెన్సీ అయిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సింగర్‌కు అంగరంగ వైభవంగా సీమంతం జరిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీమంతం కార్యక్రమంలో గీతామాధురి-నందు ఉదక శాంతి పూజలు చేశారు. ఎలాంటి దోషాలు, చీడపీడలు లేకుండా శాంతి, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని ఈ పూజ చేయించారు.

అయితే తాజాగా గీతా మాధురికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ హ్యాపీ మూమెంట్‌ను గీతామాధురి-నందు సోషల్ మీడియాలోని తమ అభిమానులతో పంచుకున్నారు. కానీ బుడ్డోడి ఫొటో మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఈ వార్త ఫ్యాన్స్.. గీతామాధురి - నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed