Shraddha Kapoor: ఒక్క సినిమా విజయంతో ఇన్‌స్టాలో ఎవరు టచ్ చేయలేని రికార్డు సాధించిన శ్రద్ధా కపూర్

by Prasanna |   ( Updated:2024-08-26 14:11:02.0  )
Shraddha Kapoor: ఒక్క సినిమా విజయంతో ఇన్‌స్టాలో ఎవరు టచ్ చేయలేని రికార్డు సాధించిన శ్రద్ధా కపూర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో సినీ నటులు రెండు చేతుల్లో డబ్బు బాగా సంపాదిస్తున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీ గా ఉంటూనే మరో వైపు యాడ్స్ కూడా కవర్ చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఒకరు.

ఇటీవలే ‘స్ట్రీ 2’ మూవీతో పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ హర్రర్ కామెడీ మూవీ ఆగస్టు 15న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ బాలీవుడ్ కే ప్రాణం పోసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంతక ముందు వచ్చిన సినిమాలన్ని మధ్యలోనే బోల్తా కొట్టాయి. సరయిన హిట్ పడలేదు.. కానీ, ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ థియేటర్లో కూడా అదే జోరును కొనసాగించడంతో కేవలం పది రోజుల్లోనే రూ. 500 కోట్లను కలెక్ట్ చేసింది. ఫైటర్, కల్కి వంటి భారీ సినిమాలను కూడా వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలబడింది.

అయితే, తాజాగా శ్రద్ధా మరో రికార్డు సాధించింది. క్రికెటర్ విరాట్ కోహ్లీ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఇండియన్ సెలబ్రిటీగా నిలిచింది. మొన్నటి వరకు విరాట్ 270 మిలియన్ ఫాలోవర్స్ , ఆ తర్వాత 91.1 మిలియన్ తో నటి ప్రియాంక చోప్రా ఉండేది. కానీ, ఒక్క సినిమా విజయంతో ఆమెను క్రాస్ చేసి శ్రద్దా 92.1 మిలియన్ తో ఫాలోవర్స్ తో దూసుకెళ్లి రెండవ స్థానంలో నిలిచింది.

Advertisement

Next Story