‘ఆదిపురుష్‌’లో రోడ్‌సైడ్‌ రౌడీలా చూపించడం బాధ కలిగించింది.. దీపికా

by Kavitha |
‘ఆదిపురుష్‌’లో రోడ్‌సైడ్‌ రౌడీలా చూపించడం బాధ కలిగించింది.. దీపికా
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, దర్శకుడు ఓంరౌత్‌ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘ఆదిపురుష్‘. ప్రభాస్‌ రాముడిగా, కృతీసనన్ సీతగా నటించిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్ రావణుడిగా నటించారు. గతేడాది జూన్ లో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కాగా విడుదలై ఏడాది గడుస్తున్నా ఏదో కారణంతో ఈ చిత్రం పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలోని పాత్రలు, వేషధారణలపై అప్పట్లో ఎన్నో విమర్శలకు, వివాదాలకు దారి తీశాయి.

తాజాగా రమానంద్‌ సాగర్‌ 'రామాయణ్‌’ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రంలోని పాత్రలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ‘ఆదిపురుష్‌’ చూసిన ఈ జనరేషన్ పిల్లలు రామాయణం అంటే ఇలాగే ఉంటుందేమోనని భావిస్తారు. దీంతో రామాయణంలో రాముడు, సీత కూడా ఇలాగే ఉంటారని వారు నిర్ణయించుకుంటున్నారు. ఈ చిత్రంలో చూపించినట్లు రావణుడు ఉండడని వాళ్లకు ఎవరూ వివరించడం లేదు.

అయితే రావణుడు గొప్ప శివభక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలున్నాయి. కానీ ఆయన జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు సీతను అపహరించడం. ఆ ఒక్కటి చేయకపోతే ఆయన గొప్ప పండితుడిలా ఉండేవారు. అంత గొప్ప వ్యక్తిని ‘ఆదిపురుష్‌’లో రోడ్‌సైడ్‌ రౌడీలా చూపించడం నన్ను బాధ కలిగించింది. నేను ఈ సినిమాను ఇప్పటివరకు పూర్తిగా చూడలేదు. సీతాదేవిని గులాబీ రంగు చీరలో చూపడం, రావణాసురుడిని విఢిన్నమైన ఆహార్యంలో చూపించడం ఏమాత్రం నచ్చలేదు. ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ ఇతిహాసాల జోలికి పోకుండా యువతలో స్ఫూర్తి నింపే స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రలను సినిమాలుగా తీస్తే బాగుంటుంది’ అని దీపికా అన్నారు.

Advertisement

Next Story