K Viswanath : నేడు షూటింగ్‌లు బంద్

by Javid Pasha |   ( Updated:2023-02-04 12:54:43.0  )
K Viswanath : నేడు షూటింగ్‌లు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్ : కళాతపస్వీ కె. విశ్వనాథ్ గురువారం రాత్రి అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఇక ఈయన మరణ వార్త విని ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయామంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విశ్వనాథ్‌ మరణవార్త విని టాలీవుడ్ ప్రముఖులందరూ ఆయన నివాసానికి చేరుకుని పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

కాగా విశ్వనాథ్ మృతికి సంతాపంగా నేడు షూటింగ్‌లు బంద్ చేస్తున్నట్లు టాలీవుడ్ ప్రకటించింది. నేడు స్వచ్ఛందంగా షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఈరోజు ఉదయం 11.30 నిమిషాలకు పంజాగుట్టలో విశ్వనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి : కళాతపస్వి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Advertisement

Next Story