- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కల్కిలో 5 నిమిషాల సీన్ కోసం విజయ్ దేవరకొండ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే షాక్
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదలై హిట్ టాక్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక యావత్తు దేశం మొత్తం కూడా కల్కి మేనియాతో ఊగిపోతోంది. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైనా రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 298.5 కోట్లు రాబట్టింది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే కల్కి మూవీలో ఊహించని ట్విస్టులతో పాటు పాత్రలతో అలరించాడు నాగ్ అశ్విన్. ప్రధాన తారాగణంతో పాటు ఈ మూవీలో మాళవిక నాయర్, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్ ఎస్ రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ కె వి వంటి వారు అతిథి పాత్రలు పోషించి మెప్పించారు. వీరందరి గెస్ట్ రోల్స్ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ అనే చెప్పాలి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించారు. కల్కి మూవీలో చివరిలో ఐదు నిమిషాలపాటు కనిపించిన విజయ్ ఈ సినిమాలో అర్జునుడిగా కనిపించేందుకు మాత్రం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే తాను నటించేందుకు రెడీ అన్నాడని.. అందుకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. అలాగే కల్కి సెకండ్ పార్టులో కూడా విజయ్ దేవరకొండ పోషించిన పాత్రకు మరిన్ని సీన్స్ ఉండనున్నట్లు సమాచారం.