Kushboo: మా నాన్నే నన్ను లైంగికంగా వేధించాడు: ఖుష్బూ సుందర్

by Prasanna |   ( Updated:2023-03-06 06:36:30.0  )
Kushboo: మా నాన్నే నన్ను లైంగికంగా వేధించాడు: ఖుష్బూ సుందర్
X

దిశ, సినిమా : భాషతో సంబంధం లేకుండా.. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరోయూన్ ఖుష్బూ సుంద‌ర్‌. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. రీసెంట్‌ జాతీయ మ‌హిళా క‌మిష‌న్ మెంబర్‌గానూ ఎంపికయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బు. దేశంలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మస్యలు, లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. తాను స్వయంగా ఎదుర్కొన్న అనుభవాలను కూడా వెల్లడించింది. ‘‘నా తండ్రి మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తించే వాడు.. అమ్మను చిత్ర హింస పెట్టేవాడు, నన్ను కూడా లైంగికంగా వేధించడం తన జన్మహక్కుగా భావించేవాడు.

నాకు వేధింపులు ప్రారంభమైనప్పుడు 8 ఏళ్ల వయస్సు ఉంది. 15 సంవత్సరాల వయస్సులో మా నాన్నను ఎదిరించి మాట్లాడే ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ నా తండ్రి చేతిలో నేను లైంగిక వేధింపులకు గురైనట్లు మా అమ్మకు ఇప్పటి వ‌ర‌కు చెప్పలేదు. ఇప్పుడు చెప్పినా త‌ను న‌మ్మదు. కానీ చిన్న పిల్లలపై లైంగిక దాడి జరిగినప్పుడు ఆ బాధ వారిని జీవితాంతం వెంటాడుతుంది. వారి జీవితంలో ఓ మ‌చ్చగా మిగులుతుంది. ’’ అంటూ ఖుష్బూ తన బాధ‌ను వ్యక్తం చేసింది.

Read more:

టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్న సమంత.. బాధలో ఫ్యాన్స్ ?

Advertisement

Next Story