ఆ విషయంలో తమన్నాను మించిపోయిన శోభిత

by Sridhar Babu |   ( Updated:2023-07-05 12:26:55.0  )
ఆ విషయంలో తమన్నాను మించిపోయిన శోభిత
X

దిశ, వెబ్​డెస్క్​ : సినీ పరిశ్రమలో తెలుగమ్మాయిలు అడపాదడపా తళుక్కున మెరుస్తుంటారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఇతర రాష్ట్రాల భామలే ఎక్కువగా కనిపిస్తుంటారు. మన తెలుగు అమ్మాయిలు కూడా కొందరు పరభాషా చిత్రాల్లో నటించి మెప్పించిన వారు ఉన్నారు. అలాంటి కోవకే చెందిన అమ్మడు శోభిత ధూళిపాళ్ల. ఈమె తెలుగు కంటే ఎక్కువగా హిందీలో సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈమె ఇది నైట్ మేనేజర్ అనే వెబ్​ సీరీస్​ సెకండ్ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తన అందాలతో మత్తెక్కిస్తోంది. మరీ ముఖ్యంగా తమన్నా కంటే రెచ్చిపోయి నటించిందని ప్రచారం జరుగుతోంది. ఈ అమ్మడు గూడచారి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అనంతరం పలు ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

అలాగే మణిరత్నం దర్శకత్వంలోని చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఆమె నటించిన ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ గత కొంతకాలం క్రితం విడుదలై ఈమెకు హాట్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన సీక్వెల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో శోభిత గతం కంటే మరింత బోల్డుగా నటించింది. ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఈ సిరీస్ లో నటించగా అతనితో రెచ్చిపోయింది. దాంతో రొమాంటిక్ సీన్స్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఆమె ఫ్యాన్స్ భలే రెచ్చిపోయింది గురు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని కొందరు, తమన్నాని మించిపోయిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే నాగచైతన్య, శోభిత డేటింగ్ లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ప్రచారంపై వారిద్దరిలో ఎవ్వరూ ఇప్పటి వరకు స్పందించలేదు.

Read more : సచిన్ కూతురిపై దారుణమైన ట్రోలింగ్.. బూబ్స్ బరువెక్కిపోతున్నాయంటూ

ఓపెన్‌గానే ఓరల్ సెక్స్‌లో పాల్గొన్న పాండ్యా దంపతులు.. సిగ్గు, శరం లేదంటున్న జనాలు

Advertisement

Next Story