- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీ ఆస్తి మొత్తం నా బాత్రూమ్ విలువ కాదు.. హీరోయిన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో!
దిశ, సినిమా: ఒకప్పటి అగ్ర హీరో శోభన్ బాబు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత పరిశ్రమలో స్టార్ హీరోగా నిలదొక్కుకున్న హీరోల్లో శోభన్ బాబు ఒకరు. అయితే ఈ హీరోను ఓ సినిమా షూటింగ్ స్పాట్ లో ఓ హీరోయిన్ ఇరిటేట్ చేసిందట. దీంతో శోభన్ బాబు ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. మరీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. 1990 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు తెచ్చుకున్న నటి నగ్మా.
ఒకప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి.. తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇకపోతే శోభన్ బాబు-నగ్మా కలయికలో ‘అడవి దొంగ’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఓ పాట షూట్ కోసం అవుట్ డోర్ వెళ్లారట. అయితే ఒకరోజు సెట్స్ లో షాట్స్ కోసం అందరూ రెడీ గా ఉండగా.. నగ్మా మాత్రం 2 గంటల వరకు రాలేదట. ఆమె కోసం హీరో వెయిట్ చేశారట.
నగ్మా తీరిగ్గా సెట్స్ కు వచ్చాక.. శోభన్ బాబు ఆమెను ఎక్కడికెళ్లావని అడగ్గా తలతిక్క సమాధానం చెప్పిందట. దీంతో హీరో నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుందని అడిగారట. నగ్మా ఆన్సర్ చెప్పగా, అవునా నా ఇంట్లో ఉండే బాత్రూమ్ విలువ కాదు. ఫస్ట్ క్రమశిక్షణ గా ఉండటం, టైమింగ్ ను ఫాలో అవ్వడం నేర్చుకో అంటూ మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చారట.