Canadian girl : కెనడా అమ్మాయితో అమలాపురం అబ్బాయి పెళ్లి

by Y. Venkata Narasimha Reddy |
Canadian girl : కెనడా అమ్మాయితో అమలాపురం అబ్బాయి పెళ్లి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమకు..ప్రేమ వివాహాల(love marriages)కు సరిహద్దులుండవు. దేశ సరిహద్దులే కాదు..ఖండాలు సైతం దాటి వెళ్ళిన వారు ప్రేమ పెళ్లిళ్ళతో ఒక్కటవ్వడం తరుచు జరుగుతునే ఉన్నాయి. అదే తరహాలో ఇండియా అబ్బాయి(Indian Boy), కెనడా అమ్మాయి(Canadian Girl)మధ్య చిగురించిన ప్రేమ వారిని ఏడడుగుల బంధం వైపు నడిపించింది. వారి ఖండాంతర ప్రేమ పెళ్లికి అంబేద్కర్ కోనసీమ జిల్లా వేదికైంది. కెనడాలో బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అమలాపురంకు చెందిన మనోజ్ కుమార్, కెనడా అమ్మాయి ట్రేసి రోచే డాన్ తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ జంట ప్రేమకు రంగు, భాష, దేశంతో సంబంధం లేదని చాటింది. అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన మనోజ్ కుమార్ 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లారు. ప్రస్తుతం అక్కడే బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

మనోజ్ కుమార్, ట్రేసి రోచే డాన్​లు 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరికి కెన్యాలో నిశ్చితార్థం జరగగా కెనడా సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇటు హిందూ, తెలుగు సాంప్రదాయంగా వివాహం చేసుకునేందుకు వారిద్దరు ఈదరపల్లిలోని స్వగృహానికి వచ్చారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురుకు హల్దీ వేడుక నిర్వహించారు. గ్రామంలో కెనడా దేశస్థుల రాకను, ప్రేమ జంట వివాహ తంతును ఆ ఊరి జనం ఆసక్తిగా తిలకించారు. ఈ వారంలో మలికిపురం మండలం దిండిలో హిందూ సాంప్రదాయం ప్రకారం తాము వివాహం చేసుకుని 8న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు మనోజ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed