ఓటీటీలోకి గెటప్ శీను లేటెస్ట్ మూవీ ‘రాజు యాదవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

by Kavitha |
ఓటీటీలోకి గెటప్ శీను లేటెస్ట్ మూవీ ‘రాజు యాదవ్’..  స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
X

దిశ, సినిమా: ‘జబర్ధస్త్’ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో గెటప్ శీను కూడా ఒకరు. తన డిఫరెంట్ గెటప్స్, నటనా చాతుర్యం, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నింటితో మెప్పించి బుల్లితెర కమల్ హాసన్ అనిపించుకున్నాడు గెటప్ శీను. అతని నటనకు ఎంతో మంది హీరోలు కూడా కడుపుబ్బా నవ్వుకుని మంచి టాలెంట్ ఉందని పొగిడినారు. ప్రస్తుతం అటు బుల్లితెరను, ఇటు వెండితెరను ఏలేస్తున్నాడు ఈ స్టార్ కమేడియన్. స్టార్ హీరోల సినిమాల్లో హాస్యనటుడిగా నటిస్తోన్న గెటప్ శీను ఇటీవలే హీరోగా మారాడు.

కృష్ణమాచారి తెరకెక్కించిన ‘రాజు యాదవ్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ సినిమాలో అంకికా కారత్ హీరోయిన్ గా నటించింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించిన రాజు యాదవ్ మే 24న థియేటర్లలోకి వచ్చిన తర్వాత అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ ఫెయిల్ అయ్యింది. గెటప్ శీను నటనకు ప్రశంసలు వచ్చినా కథా, కథనంలో లోపాలు అభిమానులను నిరాశ పరిచాయి. దీంతో చాలా మంది రాజు యాదవ్ ను లైట్ తీసుకున్నారు. కాగా ఇప్పుడు రాజు యాదవ్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కు వచ్చేస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నేపథ్యంలో జూన్ 22 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాను వరుణ్వి క్రియేషన్స్ పతాకంపై రాజేష్ కల్లేపల్లి ప్రశాంత్ రెడ్డి నిర్మించగా.. హర్షవర్ధన్ రామేశ్వర్, సురేష్ మ్యూజిక్ అందించారు. ఆనంద చక్రపాణి, రూపాలక్ష్మి, ఉన్నతి, ఉత్తర ప్రశాంత్, సంతోష్ రాజ్, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisement

Next Story