- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తండ్రైన శర్వానంద్.. పుట్టిన పాపకు పెట్టిన పేరు ఏమిటంటే?

X
దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన ఫ్యాన్స్‌కు తీపికబురు అందించారు. ఆయన తండ్రి అయ్యానని, తన భార్య రక్షిత రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తన చిన్నారి కూతురు తన వేలిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. తన గారాల పట్టీకి లీలా దేవీ మైనేని అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఇక శర్వానంద్ తన పుట్టిన రోజునాడే తన కూతురి ఫోటోను షేర్ చేసి పాపకు జన్మనిచ్చారని చెప్పడంతో చాలా మంది అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో శర్వా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే, కూతురు ఏ రోజు జన్మించారో కచ్చితంగా శర్వానంద్ చెప్పలేదు కానీ, తన పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు.
Next Story