వేణు మాధవ్‌కి 8 ఫ్లాట్‌లు ఉన్నాయి.. నేను మాత్రం అద్దె ఇంట్లో ఉంటున్న: తల్లి ఆవేదన

by sudharani |   ( Updated:2023-01-31 10:35:40.0  )
వేణు మాధవ్‌కి 8 ఫ్లాట్‌లు ఉన్నాయి.. నేను మాత్రం అద్దె ఇంట్లో ఉంటున్న: తల్లి ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి నవ్వుల నటరాజ్ వేణు మాధవ్ గురించి తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో వేణు మాధవ్ కూడా ఒకరు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన వేణు మాధవ్ ఆ తర్వాత అనారోగ్య కారణాల చేత మరణించారు. అతని మరణం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో బాధపెట్టింది. ఇదిలా ఉంటే వేణు మాధవ్ తల్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

వేణు మాధవ్ తల్లి సావిత్రమ్మ మాట్లాడుతూ.. ''నాకు ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలు. అందులో వేణు మాధవ్ చిన్నప్పటి నుంచే చాలా చలాకీగా ఉండేవాడు. మిమిక్రీ కూడా చేసేవాడు. ఈ క్రమంలోనే.. ఓ ప్రోగ్రామ్‌లో ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి చూసి సినిమాల్లోకి అవకాశం ఇచ్చారు. ఇక వేణు మాధవ్ బిజీగా ఉండటంతో మిగిలిన ఇద్దరి కొడుకులను కూడా తన దగ్గర అసిస్టెంట్లుగా పెట్టాను అదే నేను చేసిన పొరపాటు.

అయితే వేణు మాధవ్‌కు ఏ జబ్బు చేసిన మందులు వేసుకునే అలవాటు లేదు. అదే ఆయన అనారోగ్యానికి కారణం అయ్యింది. కూతురు పెళ్లి వలన ఓ కొడుకు చనిపోయాడు. ఆ తర్వాత అనారోగ్య సమస్యల కారణాలతో నెలా పదిహేను రోజులు కాలంలోనే వేణు మాధవ్ కూడా చనిపోయారు. వేణు మాధవ్‌కు ఏనిమిది ఫ్లాట్ వరకు ఉన్నాయి. 20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. నేను మాత్రం అద్దె ఇంట్లో ఉంటున్నాను. నా కొడుకు బతికి ఉంటే నాకు ఏమైనా ఇచ్చేవాడేమో'' అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story