అమెరికాలో జాబ్ చేస్తున్న హీరోయిన్ లయ.. పిక్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-04-27 15:39:53.0  )
అమెరికాలో జాబ్ చేస్తున్న హీరోయిన్ లయ.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ లయ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె తన భర్త పిల్లలతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో సెటిల్ అయిపోయింది. ఇదిలావుంటే.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న లయ.. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫొటోలు, రిల్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం లయ ఖాళీగా ఉండకుండా అమెరికాలో ఏవియేషన్ ఏరోస్పేస్ కంపెనీలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ఈ కంపెనీలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ.

Also Read.. నేను వాళ్లలా ఆలోచించను: పంజాబీలపై షెహనాజ్ సెటైర్


Advertisement

Next Story