ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ‘సత్యభామ’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Kavitha |
ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ‘సత్యభామ’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలోకి ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నది. ఇక స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు మళ్ళీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మొదటిసారిగా లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ లో నటించింది. అయితే ఈ సినిమా జూన్ 7న థియేటర్లలో విడుదల కాగా మంచి టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క ఓటీటీ ప్లాట్ ఫారం ఫిక్స్ అయింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సత్యభామ ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం. థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత సత్యభామ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. జులై ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ నుంచి ఈ మూవీ ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా జూన్ నెలాఖరున సత్యభామ ఓటిటి రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ లో తన నటనతో అదరగొట్టిన కాజల్ అగర్వాల్ విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటుంది. ఇక థియేటర్లలో ఈ మూవీ జోరుగా కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది.

Advertisement

Next Story