Sardar Twitter Review: 'సర్దార్‌' మూవీ ట్విట్టర్ రివ్యూ..

by Hamsa |   ( Updated:2022-10-21 12:46:06.0  )
Sardar Twitter Review: సర్దార్‌ మూవీ ట్విట్టర్ రివ్యూ..
X

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్‌ కార్తీ హీరోగా, పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్యంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సర్దార్'. తమిళ్, తెలుగులో నేడే విడుదలవగా.. సినిమా చూసిన ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో బ్లాక్‌బస్టర్‌ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా మంచి మెసేజ్‌ ఇచ్చారని, ఫస్టాఫ్‌‌తో పాటు ఇంటర్వెల్‌ సీన్‌ చాలా బాగుందని అభిప్రాయపడుతున్నారు. ఇక కార్తీ విషయానికొస్తే.. డ్యూయల్‌ రోల్‌లో అదరగొట్టాడని, ముఖ్యంగా సీనియర్‌ క్యారెక్టర్‌లో తన నటన అద్భుతమని మరో అభిమాని ట్వీట్‌ చేశాడు. మొత్తానికి స్టోరీ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నట్లు ఎక్కువ మంది ట్వీట్స్‌ చేశారు. పైగా ఈ సినిమాకు యూఎస్‌ ప్రీమియర్స్‌ నుంచి కూడా పాజిటివ్‌ రివ్యూలు దక్కాయి. ఇక తెలుగులో ఈ మూవీని అక్కినేని నాగార్జున రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న కార్తీ ఊహించినట్లే మంచి హిట్ అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి :

మెగాస్టార్ 'మెగా 154' టైటిల్ డేట్ ఫిక్స్

Pooja Hegde కాలుకు గాయం.. ఆందోళనలో అభిమానులు

Advertisement

Next Story