ఆ సినిమాలో నటించడం నా అదృష్టమే.. సప్తమి గౌడ

by Vinod kumar |   ( Updated:2023-04-07 10:21:57.0  )
ఆ సినిమాలో నటించడం నా అదృష్టమే.. సప్తమి గౌడ
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సప్తమి గౌడ తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకు స్పెషల్ థాంక్స్ చెప్పింది. ఈ మూవీలో తన నటనకుగానూ తాజాగా ఓ అవార్డు అందుకున్న బ్యూటీ ఆ ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో చాన్స్ రావడం నా అదృష్టమే. రిషబ్ శెట్టి ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఊహలకు మించి రూపొందిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు. కన్నడ ఇండస్ట్రీ పేరు మారుమోగిపోయింది.

దీనివల్లే ప్రస్తుతం నాకు చేతినిండ పని దొరుకుతుంది. నా కెరీర్ బిజీగా నడుస్తోంది’ అంటూ మూవీపై ప్రశంసలు కురిపించింది. చివరగా భవిష్యత్తులో ఒకే రకమైన కథలు, పాత్రలు పోషించకుండా ప్రతి సినిమాకు ఢిఫరెంట్ రోల్స్ చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. అంతేకాదు మంచి స్టోరీ దొరికితే భాషతో సంబంధం లేకుండా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి: నేను టాయిలెట్‌ వెళ్లాలంటే నా భార్య సహాయం కావాలి: పోసాని

Advertisement

Next Story