అనుభవజ్ఞులే ఆనందపరుస్తారు.. ఎవరేమనుకున్నా ఇదే నిజం!

by Hajipasha |   ( Updated:2023-01-11 07:17:10.0  )
అనుభవజ్ఞులే ఆనందపరుస్తారు.. ఎవరేమనుకున్నా ఇదే నిజం!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సంజనా సంఘీ సీనియర్లతో కలిసి పనిచేయడం ఉత్సాహంగా ఉందంటోంది. చైల్డ్ అర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్లతో పోటీపడుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తను నటించిన చిత్రం 'ధక్ ధక్' త్వరలో విడుదల కాబోతున్న సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. తనకన్నా వయసులో చాలా పెద్దవాళ్లతో కలిసి నటించడంపై భిన్నమైన వాదనలు వినిపించాయని, అయితే ప్రజల కాంప్లిమెంట్స్ చూసి తానెప్పుడూ ఆందోళన చెందలేదని చెప్పింది. ఎందుకంటే తాను సంప్రదాయ హిందీ సినిమా హీరోయిన్ మార్గాన్ని ఎంచుకోలేదని, తనలాంటి నటీమణులు మాస్ అప్పీల్ ఉన్న పాత్రలను ఎంచుకునే దశలో నెగెటివ్ కామెంట్లు సాధారణంగా భావించాలని సూచించింది. అలాగే ఒక ప్రాజెక్ట్‌లో నటుడు పంకజ్ త్రిపాఠికి కూతురిగా, మరొక సినిమాలో రత్న పాఠక్ షా‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందన్న ఆమె.. 'అనుభవజ్ఞులతో కలిసి పనిచేస్తున్నపుడు చాలా నేర్చుకుంటా. వాళ్ల జీవనశైలి, నటనను గమనిస్తూనే ఏ సన్నివేశంలో ఎలా నటించాలి? ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి? అనే విషయాలను తెలుసుకుంటా. ఒక నటిగా ఇలాంటి అవకాశాలను అదృష్టంగా భావిస్తా' అంటూ తన అభిప్రాయాలు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి : కామంతో రగిలిపోతున్న స్టార్ హీరోయిన్లు.. ఈ వీడియో చూస్తే కాదనలేరు!

Advertisement

Next Story

Most Viewed