Vikas yadav: నాకు ప్రాణహాని ఉంది.. ఢిల్లీ కోర్టుకు రా మాజీ అధికారి వికాస్ యాదవ్ విజ్ఞప్తి

by vinod kumar |
Vikas yadav: నాకు ప్రాణహాని ఉంది.. ఢిల్లీ కోర్టుకు రా మాజీ అధికారి వికాస్ యాదవ్ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్‌ పన్నూన్‌(Khalistani terrorist Pannun) ను హతమార్చేందుకు భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (Raw) మాజీ అధికారి వికాస్ యాదవ్ (viks Yadav) కుట్ర పన్నారని అమెరికా(Amerika) అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. దీనిపై యూఎస్‌లో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తనకు ప్రాణాహాని ఉందని పేర్కొంటూ వికాస్ యాదవ్ ఢిల్లీ కోర్టు(Delhi Court)ను ఆశ్రయించారు. ఇప్పటికే తను నిందితుడిగా ఉన్న దోపిడీ, కిడ్నాప్ కేసుకు సంబంధించిన కేసులో ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తనపై తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన వ్యక్తిగత వివరాలు, అడ్రస్, నేపథ్యం, ​​ఫోటోగ్రాఫ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైనందున తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు.

వికాస్ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ పోలీసుల ఎదుట భౌతిక హాజరు నుంచి మినహాయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌లో అమెరికా న్యాయశాఖ వికాస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు ఆయన కుట్ర పన్నారని ఆరోపించింది. అయితే ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఓ కేసులో ఆయనను అరెస్ట్ చేయగా బెయిల్ పై విడుదలయ్యారు. ప్రస్తుతం బయటే ఉన్న ఆయన తాజాగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. కాగా, అమెరికాలో పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్ర జరగగా తాము ఆ కుట్రను భగ్నం చేశామని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story