- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ చేతి ముద్రతో గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్!
దిశ, ఫీచర్స్: ప్రపంచ వ్యాప్తంగా యోగా అనేది ఎంతో ప్రాచుర్యం పొందినది. ఈ బిజీ కాలంలో యోగా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఈ యోగాలో భాగంగా ఉండే కొన్ని రకాలు, అనేక వ్యాధులను తగ్గిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారాలు రోజూ తినడం వల్ల చాలామందిలో జీర్ణక్రియ దెబ్బతింటోంది. దీని కారణంగా మలబద్ధకం, గ్యాస్ట్రిక్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయి. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొన్ని యోగాసనాలు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాణ ముద్ర: ఈ ముద్ర జీర్ణశక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక సమస్యతను పెంచడంలో సహాయపడుతుంది. ముందుగా నేలపై కూర్చుని, రెండు చేతులను మోకాళ్లపై పెట్టుకోవాలి. తర్వాత ఉంగరం వేలు, చిటికెన వేలితో బొటనవేలు కొనను తాకి, మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచి, శ్వాసపై దృష్టి పట్టాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియతో పాటుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వజ్రాసనం: ప్రతి రోజు వజ్రాసనం వేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనం చేయడానికి ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తర్వాత రెండు చేతులను మోకాళ్ల వద్ద ఉంచాలి. ఇలా రోజు 5 నుంచి 10 నిమిషాలు చేస్తే, జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయపడుతుంది.
సూర్య ముద్ర: ఇది జీవక్రియ, జీర్ణక్రియను పెంచుతుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, తేలికగా ఉంచుతుంది. ఉంగరపు వేలి కొనను బొటనవేలు కొనతో కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్లను నిటారుగా పెట్టాలి. వ్యాయమం తరువాత ఇలా చేయడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.
పూషన్ ముద్ర: ముందుగా వజ్రాసం, లేదా సుఖాసనంలో కూర్చోవాలి. కుడి చేతి బొటన వేలు కొన వరకు చూపుడు వేలు, మధ్య వేళ్ళ చివర్లను కలపండి. ఉంగరం వేలు, చిటికెన వేలుని చాపి, చేతును నిటారుగా ఉంచండి. అదే విధంగా ఎడమ చేతి మధ్య, ఉంగరపు వేళ్ల చివర్లని బొటనవేలు కొనవరకు తాకించండి. ఇండెక్స్, చిన్న వేళ్లును చాచి ఉంచండి. ఈ రెండు ముద్రలను పెట్టిన తరువాత అరచేతులను ఒకదానికొకటి నిటారుగా ఉంచండి. పూషన్ ముద్ర ప్రతి రోజు వేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి సహాయపడుతుంది.
ముఖ్యంగా భోజనం చేస్తున్నప్పుడు ఫోన్స్, టీవీలు చూసే అలవాటును మానుకోండి. ప్రతి రోజూ భోజనం తరువాత 15 నిమిషాలపాటు నడవడం అలవాటు చేసుకోండి. నడిచిన తరువాత వెంటనే నిద్రపోకుండా కొంత సమయం ప్రశాంతంగా కూర్చోండి. ఇలా చేయడం వల్ల ఆహారం సక్రమంగా జీర్ణం కావడంతోపాటుగా గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి.