- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Srihari vs Rajaiah: నియోజకవర్గంలో ఎవరో ఒక్కరమే ఉండాలని కడియం సంచలన సవాల్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah)కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) సవాల్ విసిరారు. ఆదివారం ఓ కార్యక్రమంలోని పాల్గొని మాట్లాడారు. దళితబంధు(Dalit bandhu)లో రాజయ్య చేసిన అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. తప్పు ఉందని తేలితే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్(KCR) కుటుంబం అవినీతి, అక్రమాల పుట్ట అని కీలక వ్యాఖ్యలు చేశారు.
దేవనూరు అటవీ భూముల(Devanur Forest Lands) కబ్జా ఆరోపణలు నిరూపిస్తే తాను కూడా రాజకీయాల నుంచి తప్పకుంటా అని సంచలన ప్రకటన చేశారు. ‘ఉప ఎన్నికలు వస్తయ్.. గెలుస్తా అని రాజయ్య ఆశ పడుతున్నడు.. కానీ అవేమీ జరుగవు’ అని ఎద్దేవా చేశారు. మొన్ననే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి మారలేదని మండిపడ్డారు. ఇక నుంచి రాజయ్య చేసే ఆరోపణల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటానని అన్నారు. ఆరోపణలు చేయడం కాదని.. నిరూపించాలని అన్నారు. ఇక నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలని కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.