Naravaripalle: రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తి

by srinivas |
Naravaripalle: రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో నారావారిపల్లెలో కార్యక్రమం జరిగింది. తమ్ముడు సీఎం చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుడి పాడె మోశారు. రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నారా రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున1989లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వివిధ పదవుల్లో పార్టీకి, ప్రజలకు సేవ చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామం నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed