ఎప్పుడూ కష్టాన్నే ఎంచుకోవాలంటూ విడాకులపై క్లారిటీ ఇచ్చిన సానియా మీర్జా.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-01-18 05:01:26.0  )
ఎప్పుడూ  కష్టాన్నే ఎంచుకోవాలంటూ విడాకులపై క్లారిటీ ఇచ్చిన సానియా మీర్జా.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌కు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా పలు పోస్టులతో హింట్ ఇస్తున్నారు. తాజాగా, మరోసారి సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘ పెళ్లి కష్టం.. విడాకులు కూడా కష్టమే. మీరు కఠినంగా ఉండి ఎంచుకోండి. లావుగా ఉండటం కష్టమే.. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే.

అప్పు ఉండటం కష్టం. ఆర్థిక క్రమశిక్షణ పాటించడమూ కష్టమే. మీరు కఠినంగా ఉండి ఎంచుకోండి. ఇతరులతో కలిసి మెలసి మాట్లాడటం కష్టం. ఏ సమాచారం లేకుండా ఉండటం కష్టమే. అప్పుడే కఠినంగా ఉండి ఎంపిక చేసుకోవాలి. జీవితం అనేది అంత సులభం కాదు. అది ఎప్పటికీ కష్టమే. కానీ మనం ఎప్పుడూ మన కష్టాన్నే మనం ఎంచుకోవాలి’’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చేలా చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తొందరలోనే సానియా భర్తతో విడిపోతుందని అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.




Advertisement

Next Story

Most Viewed