సమంత 'శాకుంతలం' సినిమా వాయిదా.. ఎందుకంటే?

by Hamsa |   ( Updated:2022-09-30 07:36:07.0  )
సమంత శాకుంతలం సినిమా వాయిదా.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ థియేటర్స్‌లో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ షాకింగ్ న్యూస్ చెప్పింది. సినిమా విడుదలను కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 4న రిలీజ్ కానున్న ఈ సినిమాను 3డీలో అందించాలనే ఉద్దేశంతో విడుదలను వాయిదా వేస్తునట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. 'భారీ స్థాయిలో అద్భుతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. అందుకే ఇంతకు ముందు ప్రకటించిన తేదీకి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం' అంటూ రాసుకొచ్చింది.

Also Read: పెళ్లి పీఠలెక్కేందుకు తొందరపడుతున్న అనుపమ.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story