Samantha :: కల మొదలైందంటూ పోస్ట్.. ఫొటోలు వైరల్..!!

by Hamsa |   ( Updated:2023-07-24 08:19:59.0  )
Samantha :: కల మొదలైందంటూ పోస్ట్.. ఫొటోలు వైరల్..!!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేసుకున్నట్లు అధికారికంగా తెలిపింది. కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే గతంలో సమంతకు మయోసైటీస్ వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. అది మళ్లీ తిరగబడటంతో అమెరికా వెళ్లి చికిత్స తీసుకోబోతుందని పలు వార్తలు వచ్చాయి. సమంత సోషల్ యాక్టీవ్‌గా ఉంటూ ఇతర కంట్రీస్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు పంచుకుంటుంది.

తాజాగా, ఇండోనేషియా దీవుల్లో బాలిలోని అందమైన ప్రకృతిలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. తాను పెట్టుకున్న క్యాప్‌పై ‘కల మొదలైంది’ అనే పదాన్ని మాత్రమే చూపించింది. అలాగే మరో ఫొటోలో చేతులతో యోగా ముద్ర వేస్తూ కనిపించింది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ సామ్ ప్రకృతి పద్ధతిలో మెడిటేటివ్ ట్రీట్‌మెంట్ తీసుకుటుందని కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :: ఓరీ దేవుడా.. సమంత ఇలా మారిపోయింది ఏంటీ ?

Advertisement

Next Story