నా క్యారెక్టర్ పై అందరికీ అనుమానమే.. సమంత షాకింగ్ కామెంట్స్!

by Jakkula Samataha |
నా క్యారెక్టర్ పై అందరికీ అనుమానమే.. సమంత షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ, తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకొని, నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఏ పాత్రలోనైనా సరే ఇట్టే ఒదిగిపోతుంది. పల్లెటూరి అమ్మాయిగా, సిటీ గర్ల్‌గా, మాస్, యాక్షన్, లేడీ ఓరియెంటెడ్ ఇలా ఎందులోనైనా సమంత నటించి తన అభిమానులను మెప్పిస్తుంది. అయితే తాజాగా సమంత రంగస్థలంలో తాను పోషించిన రామలక్ష్మి పాత్ర గురించి ఆసక్తికర విషయాలు తెలిసింది.

సమంత తెలుగ ఇండస్ట్రీ‌లోకి అడుగు పెట్టి 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, సామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో నటి మాట్లాడుతూ..రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర కోసం మొదటగా నన్ను ఎంపిక చేయలేదు.సమంతను పల్లెటూరి అమ్మాయిగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదోనని మేకర్స్ ఆందోళన చెందినట్లు చెప్పింది. అంతేకాదు ఈ క్యారెక్టర్ గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారని, నా క్యారెక్టర్ పట్ల అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఈ పాత్ర తన కెరీర్ కు దెబ్బ పడుతుంది కావచ్చునని మేకర్స్ ఆందోళనకు గురైనట్లు తెలిపింది. కానీ రామలక్ష్మి పాత్ర నాకు చాలా గుర్తింపునిచ్చింది. సుకుమార్ నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఆఫర్ చేశారు. ఇందులో నేను నటించడం నా అదృష్టం అని తెలిపింది. ఇక రామ్ చరణ్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Advertisement

Next Story