విడాకులు తీసుకున్నా.. ఆ పని చేయనిదే నిద్రపోనంటున్న సమంత

by Jakkula Samataha |
విడాకులు తీసుకున్నా.. ఆ పని చేయనిదే నిద్రపోనంటున్న సమంత
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా సామ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అది ఏమిటంటే?

విడాకుల తర్వాత సామ్ లైఫ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయంట. ముఖ్యంగా మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత సమంత తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఆమె ఫిట్‌నెస్ విషయంలో చాలా స్ట్రిట్‌గా ఉంటుందంట. సామ్ తప్పనిసరిగా రోజుకి 14 గంటలకు పైగానే వర్క్ అవుట్స్ చేస్తుందట. విడాకులై, బాధలో ఉన్నా సరే తప్పనిసరిగా వర్క్ అవుట్ చేసేదంట. ఇప్పటికీ ఈ అమ్మడు వర్క్ అవుట్ చేయనిదే నిద్ర పోదంట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇక సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని, మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడి చాలా సమస్యలను ఎదుర్కొంది. దీంతో ఈ అమ్మడు వీటన్నింటి నుంచి బయటపడటానికి కొన్ని రోజుల సినిమాలకు బ్రేక్ ఇచ్చి, వెకేషన్స్ ఎంజాయ్ చేసింది. ఇక ఈ మధ్య మళ్లీ సమంత సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిందని, మళ్లీ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed