ఇష్టమే కానీ భయమేస్తుంది.. నెట్టింట వైరలవుతోన్న సమంత పోస్ట్

by Anjali |
ఇష్టమే కానీ భయమేస్తుంది.. నెట్టింట వైరలవుతోన్న సమంత పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి సుపరిచితమే. ప్రస్తుతం సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటోంది. గత ఏడాది నుంచి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఫుడ్ విషయంలో తనకు పడని వస్తువులను దూరంగా పెడుతుంది. ఇలా తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలకు సంబంధించి ప్రతి ఒక్కటి నిత్యం ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. సమంత ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్ళడానికి కారణమైనది ఏంటో ఈ పోస్టులో తెలిపింది. ‘‘ఎవరికైన పూలు అంటే ఇష్టం ఉంటుంది. కానీ నాకు మాత్రం పూలు అంటే అలర్జీ. గతంలో ఈ పూల వల్లే నేను ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్లాను. చాలా రోజుల తర్వాత పూల దగ్గరకు వచ్చాను. ఇవి నన్ను చాలా భయపెడుతున్నాయి. మీరు అందమైన వస్తువులను ఇష్టపడినప్పుడు ఎన్నో భావాలను పంచుకుంటారు. కానీ నేను వీటిని చూసి చాలా భయపడుతున్నాను. పువ్వులతో నరకం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది’’ అంటూ సామ్ రాసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed