'వీక్' అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత

by sudharani |   ( Updated:2023-01-18 13:00:26.0  )
వీక్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతకొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే కాస్త తేరుకున్న సమంత తన తదుపరి చిత్రం 'శాకుంతలం' ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది సామ్. ఇటీవల ఓ మీడియా సంస్థ సమంత వీక్ అయిపోయిందంటూ కామెంట్ చేస్తూ ట్రోల్స్ చేసింది. ఆమె తన అందం.. వెలుగు కొల్పోవడంతో పాటు చాలా వీక్ అయిపోయిందటూ పోస్ట్ పెట్టారు.

దీనిపై స్పందించిన సమంత ధీటుగా సమాధానం ఇచ్చింది. తన లాంటి వ్యాధి మీకు రాకూడదని ఆ దేవుడిని కోరుకుంటాను అంటూ వారికి రీ కౌంటర్ ఇచ్చింది. అంతే కాకుండా తాను చాలా స్ట్రాంగ్ అని ఫ్రూఫ్ చేసుకునేలా జిమ్‌లో శ్రమిస్తూ, కండరాలు తిరిగిన దేహంతో ఓ అదిరిపోయే పోస్ట్ పెట్టింది సామ్. దానికి ''నేను అంత సున్నితం కాదు'' అనే ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సమంత ఈజ్ బ్యాక్.. ఇది చాలా ఇంకా కావాలా.. సమంత చాలా మందికి స్ఫూర్తి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


READ MORE

పిచ్చి పిచ్చిగా వాగితే చెంప పగలగొడతా: షాలిన్‌పై టీనా ఫైర్

Advertisement

Next Story