Salman Khan, Pooja Hegde డేటింగ్.. సిగ్గుందా అంటూ ఫైర్ అయిన ఫ్రెండ్

by sudharani |   ( Updated:2022-12-14 03:03:21.0  )
Salman Khan, Pooja Hegde డేటింగ్.. సిగ్గుందా అంటూ ఫైర్ అయిన ఫ్రెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, బుట్టబొమ్మ పూజా హెగ్దే ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రషీద్ ఖాన్ చేసిన ట్వీట్ వైరల్‌‌గా మారడంతో ఈ వార్తలు చర్చకు తెరలేపాయి. అయితే ఈ వార్తలపై తాజాగా సల్మాన్ ఖాన్ స్నేహితుడు ఒకరు స్పందించారు. ఆయన మాట్లాడుతూ..

''ఇలాంటి బాధ్యతారహితమైన వార్తలు వైరల్ చేసేవాళ్లకు కాస్త సిగ్గు ఉండాలి. పూజా హెగ్దే సల్మాన్ ఖాన్‌కు కుతూరు లాంటిది. ఇద్దరు కలిసి సినిమాలో నటిస్తున్నంత మాత్రాన మీ ఇష్టమెచ్చిన వార్తలు వైరల్ చేస్తారా.. కొంత మంది మూర్ఖులు తమ చానల్ పబ్లిసిటీ కోసం ఇలాంటి వార్తలు వ్యాప్తి చేస్తుంటారు'' అంటూ ఫైర్ అయ్యారు. కాగా.. సల్మాన్ ఖాన్, పూజా హెగ్దే 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read More...

మయోసైటిస్‌తో నేనూ బాధపడ్డాను.. స్టార్ హీరోయిన్‌ Pia Bajpiee

Advertisement

Next Story