- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓరి దేవుడో.. ఇదేం డ్యాన్స్.. ఊహించని విధంగా డ్యాన్స్ చేసిన సాయిపల్లవి
దిశ, సినిమా : ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ముద్దుగుమ్మ సాయిపల్లవి. ఈ అమ్మడు తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక సాయిపల్లవి డ్యాన్స్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అంటూ అందరినీ మాయ చేసి.. లేడీ పవర్ స్టార్‌గా ట్యాగ్ సంపాదించింది. ఇక సాయి పల్లవి డ్యాన్స్ చేస్తే నెమలినే నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది..ఎంతో మంది ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు.
అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఈ చిన్నది, ఊహించని విధంగా డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ఇక ఇది చూసిన నెటిజన్లు.. ఓరి దేవుడో.. ఇదేం డ్యాన్స్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నవ్వుతూ మాస్ స్టెప్స్ వేసింది.. నువ్వు ఎలా చేసినా నీ డ్యాన్స్ బాగుటుంది అంటున్నారు తన ఫ్యాన్స్.