స్టార్ హీరోతో ప్రేమలో ఉన్నానని ఆఫర్లు రాలేదు.. ఇండస్ట్రీ కల్చర్ పై ఫైర్ అయిన యంగ్ బ్యూటీ

by Sujitha |
స్టార్ హీరోతో ప్రేమలో ఉన్నానని ఆఫర్లు రాలేదు.. ఇండస్ట్రీ కల్చర్ పై ఫైర్ అయిన యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సబా ఆజాద్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తుంది. ఆయన మాజీ భార్యతో కూడా మంచి ఫ్రెండ్ షిప్ మెయింటేన్ చేస్తుంది. అయితే హృతిక్ తో ప్రేమ విషయం గురించి ఆఫిషియల్ గా తెలిశాక ఇండస్ట్రీ నుంచి తనకు ఆఫర్లు రావడం లేదని తెలిపింది సబా. ఎలాగూ రిచ్ పర్సన్ తో లవ్ లో ఉన్నానని.. వాయిస్ ఓవర్ అవకాశాలు రాలేదని చెప్పింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఒక ఛాన్స్ రావడంతో.. ఇందుకు సంబంధించిన పని చేస్తూ పిక్ షేర్ చేసింది. దీంతోపాటు సమాజం ఎంత దిగజారి ఆలోచిస్తుందో విమర్శించింది.

'ఆఫర్లు రాకపోవడంతో తనే ఒక డైరెక్టర్ ను ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదని అడగడంతో హృతిక్ తో రిలేషన్ లో ఉన్నారు కదా మీకు ఈ పనితో అవసరం లేదనుకున్నామని సమాధానం ఇచ్చాడు. ఆ మాట విన్నాక పితృస్వామ్య వ్యవస్థపై ఇరిటేషన్ వచ్చేసింది. బాయ్ ఫ్రెండ్ రిచ్ అయిపోతే అమ్మాయి తన రెంట్, కరెంట్ బిల్లు కట్టుకోలేదా? ప్రతి విషయంలో ఆయనపై డిపెండ్ అవ్వాలా? మనుషులు ఇంకెప్పుడు మారుతారు? మాకంటూ విలువ లేదా? కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అమ్మాయిని గౌరవించండి' అని రాసుకొచ్చింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమె చెప్పింది కరెక్ట్ అని మద్దతు ఇస్తున్నారు.

Next Story

Most Viewed