ఇది హాస్టల్ కాదు.. గంజాయి డెన్..!

by srinivas |
ఇది హాస్టల్ కాదు.. గంజాయి డెన్..!
X

దిశ, వెబ్ డెస్క్: గంజాయిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొందరు మాత్రం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మాఫియాగా మారి ఇష్టమొచ్చన్లు గంజాయి అమ్మకాలు జరుపుతున్నారు. చిన్నా, పెద్ద, విద్యార్థులు, టీచర్లు అనే తేడా లేకుండా డబ్బులిస్తే చాలు అన్నట్టుగా గంజాయిని అమ్ముకుని సొమ్ముకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆ మూలాలు ఏపీలోనే కనిపిస్తున్నాయి. ఒడిశా-విశాఖ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో జోరుగా గంజాయి పెంపకాలు జరుగుతున్నాయి. పోలీసులు పలు సార్లు రైడ్ చేసి గంజాయి వనాలను ధ్వంసం చేశారు. అయినా యదేచ్ఛగా గంజాయి సరఫరా జరుగుతోంది.

తాజాగా విశాఖ జిల్లా గాజువాక చైతన్యనగర్‌లో గంజాయి కలకం రేగింది. జయంతి పెరల్ హాస్టల్‌పై పోలీసులు దాడి చేశారు. అయితే అక్కడ పరిస్థితి చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. హాస్టల్‌లో 10 మూటల గంజాయి లభ్యమైంది. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లగా చేసి చుట్టూ ఉన్న విద్యా సంస్థల హాస్టల్ విద్యార్థులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. చిన్నపిల్లలతో పాటు మహిళల ద్వారా గంజాయి ప్యాకెట్ అమ్మకాలు జరుపుతున్నారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులకు సైతం గంజాయిని సరఫరా చేస్తున్నారు. రూ. 10 రూపాయల నుంచి రూ. 100 వరకూ అమ్ముతున్నారు. బానిసలుగా మారిన విద్యార్థుల నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. హాస్టల్ రూములో గంజాయితో పాటు మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఇక హాస్టల్ పై చేసిన దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హాస్టల్ నిర్మాహకుడు పరారీలో తేల్చారు. త్వరలో కేసును ఛేదించామని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed