ప్రజా పాలన అంటే ఇదేనా?.. కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్

by Ramesh Goud |
ప్రజా పాలన అంటే ఇదేనా?.. కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామని, ప్రజాపాలన అంటే అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయిన దానిపై ట్వి్ట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. డీఈవో ను వెంటనే సస్పెండ్ చేయాలి అని పాడి కౌశిక్ రెడ్డి నిరసన తెలుపుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. దీనిపై హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.? మండిపడ్డారు.

అలాగే ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలన.? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని అన్నారు. అంతేగాక ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని, ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. కాగా మంగళవారం జెడ్పీ సమావేశంలో డీఈవో పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇదే మీటింగ్ లో కలెక్టర్ పమేలా సత్పతి తిరిగి వెళుతున్న క్రమంలో అడ్డుకొని బైఠాయించారు. దీనిపై జెడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. .


హాట్ న్యూస్: CM రేవంత్, చంద్రబాబుల బంధంపై భట్టి సంచలన వ్యాఖ్యలు

Next Story