దిశ ఎఫెక్ట్.. జలకాలాట కుదరదిక.. డ్యాం నీటి పరవళ్ల వైపు వెళ్లకుండా కట్టడి

by Aamani |
దిశ ఎఫెక్ట్.. జలకాలాట కుదరదిక.. డ్యాం నీటి పరవళ్ల వైపు వెళ్లకుండా కట్టడి
X

దిశ,కంది : ఇకపై మంజీరా డ్యామ్ కు వెళ్లి సరదాగా ఈత కొట్టొచ్చు అనే ఆలోచనకు పోలీసులు బ్రేక్ వేశారు. ఇందుకు దిశ అందించిన ప్రత్యేక కథనమే కారణం. ఈ నెల 1వ తేదీన "మంజీరలో మరణ మృదంగం" పేరిట దిశలో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. గేట్ల వైపు అడ్డదారిగా వెళ్లే దారిని గుర్తించిన పోలీసులు వెంటనే ముల్లకంచె ను ఏర్పాటు చేసి మూసివేశారు. ఇక ప్రతిరోజు తమ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని సంగారెడ్డి రూరల్ ఎస్సై వినయ్ కుమార్ చెప్పారు.

ప్రజల ఎవరు కూడా తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకునేలా విన్యాసాలు చేసి ఈతలు కొట్టొద్దని సూచించారు. పర్యాటక కేంద్రంగా నిలిచిన మంజీరా డ్యామ్ ను తిలకించి సురక్షితంగా తిరిగి వెళ్లాలని సూచించారు. అలాగే డ్యాం పరిసర ప్రాంతాల్లో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దిశ అందించిన కథనానికి పోలీసు అధికారులు స్పందించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story