వారి సంతోషం కోసం టార్చర్ చేస్తున్నారు.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
వారి సంతోషం కోసం టార్చర్ చేస్తున్నారు.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. పవన్, రేణు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టగానే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక వీరిద్దరి ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయారు. పవన్ ఇటీవల ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా పిన చేస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ విషయానికొస్తే.. సినిమాలకు దూరమైంది. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా అంటే మాత్రం స్ట్రాంగ్‌గా స్పందిస్తూ వార్నింగ్ ఇస్తోంది. అలాగే అనాధ పిల్లలకు, జంతువులకు తనకు తోచిన సహాయం చేస్తుంది. ఈ క్రమంలో.. తాజాగా, రేణు దేశాయ్ ఇన్‌స్టా స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. జంతువులను బంధించి జాలిలో పట్టుకుని వెళుతున్న వీడియో షేర్ చేస్తూ.. ‘‘ మీ కొద్ది క్షణాల ఆనందం కోసం జంతువులను హింసించి.. టార్చర్ చేస్తున్నారు’’ అని క్యాప్షన్ జత చేసింది.

Next Story