టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ.. మొదటిసారి నెంబర్ 1 గా హర్దిక్ పాండ్యా

by Mahesh |
టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ.. మొదటిసారి నెంబర్ 1 గా హర్దిక్ పాండ్యా
X

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ అనంతరం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. తాజాగా వెలువడిన ర్యాకింగ్స్‌లో అల్ రౌండర్ కోటాలో హర్దీక్ పాండ్యా నెంబర్ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకిన పాండ్యా 222 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే శ్రీలంక T20I కెప్టెన్ వనిందు హసరంగా కూడా 222 రేటింగ్ పాయింట్లు ఉన్నప్పటికీ అతను రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ మూడో స్థానంలో ఉండగా, సికందర్ రజా, షకీబ్ అల్ హసన్ తాజా అప్‌డేట్‌లో టాప్ 5 ఆల్‌రౌండర్‌లుగా నిలిచారు. ఇదిలా ఉంటే T20 ప్రపంచ కప్ సందర్భంగా ఒక దశలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ మొదటి ఐదు స్థానాల నుంచి తొలగించబడి.. 205 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల విషయంలో ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్ మొదటి స్థానంలో నిలవగా భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే బౌలర్ల విభాగంలో సౌతాఫ్రికాకు చెందిన అన్రిచ్ నోర్జే మొదటి స్థానంలో ఉండగా.. భారత్ కు చెందిన అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

Next Story