రేవంత్.. నువ్వు మొగోడివైతే ఆ ఆరుగురితో రాజీనామా చేయించి ఎన్నికలకు రా: కేటీఆర్ సవాల్

by Satheesh |
రేవంత్.. నువ్వు మొగోడివైతే ఆ ఆరుగురితో రాజీనామా చేయించి ఎన్నికలకు రా: కేటీఆర్ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివైతే.. నీకు దమ్ముంటే బీఆర్ఎస్ నుండి తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలకు రా అని ఛాలెంజ్ చేశారు. ఓట్లతోనే ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను కొట్టి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని అన్నారు.

అనంతరం పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పైన కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుండి వెళ్లిపోవడంతో జగిత్యాలకు పట్టిన శని వదిలిపోయిందన్నారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే.. సంజయ్‌ ఎంగిలి మెతుకులకు ఆశపడి కాంగ్రెస్ పార్టీలోకి పోయారని మండిపడ్డారు. వ్యక్తిగత పనుల కోసమే సంజయ్ పార్టీ మారారని విమర్శించారు. కాగా, ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed